Site icon NTV Telugu

Brother vs Sister: సర్పంచ్ బరిలో అన్న, చెల్లెలు.. కట్ చేస్తే!

Jgtl

Jgtl

Brother vs Sister: తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో సర్పంచ్ బరిలో తల్లి, కూతుర్లు పోటీ చేస్తుండగా మరో చోట అన్నా, చెల్లెలు పోటీ చేస్తుండడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయపల్లిలో తల్లి, కూతురు పోటీ చేస్తుండగా గుమ్లాపూర్ లో సొంత అన్నా, చెల్లెలు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.

Read Also: DRDO CEPTAM 11: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో 764 పోస్టులు..

అయితే, సర్పంచ్ ఎస్సీ జనరల్ కు ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో నిలబడ్డారు. తెడ్డు శివకుమార్ తో పాటు సొంత చెల్లెలు రౌట్ల స్రవంతి, స్రవంతి పెద్ద నాన్న కుమారుడు తెడ్డు రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక, సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తుండగా సర్పంచ్ పదవి ఎవరిని వరించబోతుందని జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా, రౌట్ల స్రవంతికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుండగా ఆమె అన్న తెడ్డు శివకుమార్ స్వతంత్ర అభ్యర్థిగా, పెద్ద నాన్న కుమారుడు తెడ్డు రమేష్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.

Exit mobile version