Site icon NTV Telugu

MLA Sanjay : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సెల్ఫీ వీడియో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Mla Sanjay Selfe Video

Mla Sanjay Selfe Video

MLA Sanjay : జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. “జగిత్యాల అభివృద్ధికి మీవల్ల సహకరించగలిగితే చేయండి, కానీ దయచేసి అడ్డుపడకండి” అని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పటికీ, అప్పటి నాయకులు దాన్ని పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

DCP Rashmi Perumal : సరోగసి పేరు చెప్పి.. చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు

తాను రాజకీయాల్లో పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందే అప్పటి సీఎం, ఎంపీ చొరవతో 4,000 పైగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేయించామని గుర్తు చేశారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా విపత్తులో గడిచినా, ఆ గృహాల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించామని చెప్పారు.

“రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అయినప్పటికీ, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాను” అని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రోడ్లు, ఆస్పత్రి, స్కూల్స్, బస్టాండ్ వంటి మౌలిక వసతుల కోసం సర్వే పూర్తి చేశామని తెలిపారు. కానీ కొందరు కావాలనే ఈ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా.. “గతంలో పట్టణ అభివృద్ధి కోసం నేను తెచ్చిన అనుమతులను కొందరు నాయకులు కావాలనే రద్దు చేయించారు” అని విమర్శించారు. నూకపల్లి అర్బన్ కాలనీలో ₹34 కోట్లతో పనులు ప్రారంభించాం. జగిత్యాల మున్సిపాలిటీకి సీఎం మరో ₹20 కోట్లు మంజూరు చేశారు అని వివరించారు. అర్బన్ కాలనీలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో ఎవరూ అడ్డుపడవద్దని ఆయన స్పష్టంగా కోరారు.

Intel layoffs: 25,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఇంటెల్..

Exit mobile version