NTV Telugu Site icon

వాళ్ళు సోనియా గాంధీ దూతలు : జగ్గారెడ్డి

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మనసులో ఉన్న ఆవేదన అంతా మీటింగ్ లో చెప్పానని, పార్టీకి సంబంధించిన అనేక అనుమానాలు పీఎసీలో లేవనెత్తనట్లు తెలిపారు.

అంతేకాకుండా ‘బయట ఎంత తీవ్రంగా మాట్లాడా,నో లోపల కూడా అలాగే మాట్లాడిన.. కొందరు లోపల ఒకలా..బయట ఇంకోలా మాట్లాడతారు అని అనుకుంటారు. లోపల ఏం జరిగింది అనేది చెప్పను. పీసీసీ, సీఎల్పీ నేత, ఠాగూర్ లను గౌరవిస్తాం. వాళ్ళు సోనియా గాంధీ దూతలు’ అంటూ వ్యాఖ్యానించారు.

‘తొందర పడి ఠాగూర్ విషయం లో నోరు జారినా వెనక్కి తీసుకుంటాం. నా ప్రకటనలు కొందరిని కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయి. నేను తప్పు చేసినా.. బయటకు చెప్పాలని మనసు ఇబ్బంది పెడుతుంది అందుకే మీడియా ముందు కొన్ని విషయాలు చెప్తున్నా’ అని అన్నారు. పార్టీ కి ఏదైనా నష్టం..కష్టం అని అనిపించే విషయాలు నా దృష్టికి వచ్చినా..బయటకు మాట్లాడనని, 2023 ఫలితాలు వచ్చే వరకు పార్టీ వ్యవహరాలపై మీడియా తో మాట్లాడను అని ఠాగూర్ కి మాటిచ్చినట్లు ఆయన వెల్లడించారు.