NTV Telugu Site icon

Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..

Cm Kcr, Jaggareddy

Cm Kcr, Jaggareddy

Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు. దీంతో పాటు 500 మందికి దళితబంధు ఇవ్వాలని, మహబూబ్ సాగర్ అభివృద్ధకి, సంగారెడ్డి చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సదాశివపేట, కొండాపూర్ లో 5 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు వినతులతో కూడిన లేఖను సమర్పించారు.

Read Also: Ravindra Jadeja: జడేజా పాంచ్ పటాకా..వాట్ ఏ కమ్‌బ్యాక్ అంటున్న ఫ్యాన్స్

వినతి పత్రాలపై అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇస్తే ప్రగతిభవన్ కు వస్తానని, నియోజకవర్గ సమస్యలపై కలుస్తా అని అన్నారు. ఈ కలయికపై కొంతమంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేదు కానీ.. నేను సీఎంని కలిస్తే తప్పా..? అంటూ ప్రశ్నించారు. ప్రధానిని డైరెక్ట్ గా కలిసే వారు డైరెక్టుగా, చాటుగా కలిసేవారు చాటుగా కలుస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న రెండు రోజులకే కోర్టు ముద్రవేశారని.. కొత్తగా వచ్చే బదనాం ఏముందని జగ్గారెడ్డి అన్నారు.