NTV Telugu Site icon

Jagga Reddy: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్

Jagga Reddy Brs Congress

Jagga Reddy Brs Congress

Jagga Reddy Gives Clarity On BRS Congress Alliance After Elections: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వచ్చే హంగ్ మాత్రమేనని, కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సంగారెడ్డి ఎమ్మెల్సే జగ్గారెడ్డి ఖండించారు. బీఆర్ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని.. అసలు కాంగ్రెస్‌తో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్న జగ్గారెడ్డి.. తెలంగాణలో బీఆర్ఎస్‌తోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పొత్తుల చర్చ లేదని, ఏం నిర్ణయమైనా రాహుల్ గాంధీదే ఫైనల్ అని చెప్పారు. పార్టీలో సొంత నిర్ణయాలకు తావు లేదని తేల్చి చెప్పారు. సింగిల్ మెజారిటీతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని చెప్పలేదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మిశ్రమ ప్రభుత్వం వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అన్నారో తనకు తెలియదన్నారు.

Syria Border : పుష్కరం తర్వాత తెరుచుకున్న సిరియా సరిహద్దులు

ఇక బీజేపీకి తమపై ఆరోపణలు చేసే అర్హత లేదన్న జగ్గారెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే కలిసి పని చేశాయని ఆరోపణలు చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ డైరెక్ట్ మద్దతు తీసుకుందన్నారు. ఆ రెండు పార్టీలు అవగాహనలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత ఫుల్ మెజారిటీ రాకుంటే.. ఆ పరిస్తితులు వేరన్నారు. అయితే.. అప్పటి పరిస్థితిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అని తిరిగి ప్రశ్నించారు. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు అంటున్నారని.. పార్టీలో స్టార్‌లు, సూపర్ స్టార్‌లే ఇట్లా మాట్లాడుతుంటే ఎవరికీ ఏం చెప్పే పరిస్థితి లేదన్నారు. మీడియాకు వెళ్లొద్దని చెప్పిన వాళ్లే ఇప్పుడు మీడియాకు ఎక్కుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

KA Paul: వెంకటరెడ్డి ఎవరో నాకు తెలీదు.. 90 శాతం ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉన్నారు

Show comments