Jadcherla Fake Baba Did Dirty Things With Women: ఓవైపు ప్రపంచ దేశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే.. మరోవైపు మన భారతదేశంలో మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. ఫలానా పూజలు చేస్తే తమ బతుకులు బాగుపడతాయని, బలిదానాలు ఇస్తే కనకవర్షం కురుస్తుందని.. చాలామంది ప్రజలు ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని.. కొందరు దొంగ బాబాలు దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి, దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా.. స్త్రీలనే టార్గెట్ చేసుకొని, వారికి మాయమాటలు చెప్పి, అశ్లీల దందాలకు దిగుతున్నారు. జడ్చర్లలోనూ ఓ దొంగ బాబా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. చివరికి అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Etela Rajender: ఈటల రాజేందర్ సవాల్.. అది నిరూపిస్తే, ముక్కు నేలకు రాకుతా
ఆ దొంగ బాబా పేరు జైనుల్లబుద్దీన్. ఇతను జడ్చర్లలో ఉంటాడు. నగ్నంగా పూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మబలికేవాడు. హైదరాబాద్‌లోని తమ గురువు వద్ద ఒకరోజంతా గడిపితే.. కాసుల వర్షానికి హద్దే ఉండదని నమ్మించాడు. అయితే.. ఇక్కడ ఒక షరతు కూడా పెట్టేవాడు. గురువుతో గడిపే సమయంలో వేరే భావన మదిలో మెదలకూడదని, పరాయి మగాడితో గడుపుతున్నామనే భావన ఒక సెకండ్ కూడా ఆలోచించకూడదని చెప్పేవాడు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే.. ధారగా కురిసే కనకవర్షం మధ్యలోనే ఆగిపోతుందని హెచ్చరించాడు. అదృష్టం మరుగున పడి, దురదృష్టం ఆవహిస్తుందని చెప్పాడు. నగ్న పూజలు చేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే మాత్రం.. రావాల్సిన అదృష్టం మాయమైపోతుందని అనేవాడు. పూజలో పూర్తిగా లీనమైపోవాలని కండీషన్ పెడతాడు.
Bandi Sanjay: పువ్వు గుర్తు పేదోళ్లకైతే, కారు గుర్తు పెద్దోళ్ల కోసం
ఆ దొంగ బాబా మాటలు నమ్మిన మహిళలు.. అతడు చెప్పినట్లుగానే వినేవారు. ఇతని వద్దకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలు కూడా వచ్చేవారు. కనకవర్షం కురవడం సంగతేమో గానీ.. ఇలా తన వద్దకు వచ్చే మహిళలతో ఆ దొంగ బాబా దుర్మార్గపు దందాలు చేయించేవాడు. స్త్రీల పుట్టుమచ్చల ఆధారంగా జాతకాలు చూస్తామంటూ నగ్న వీడియోలు కూడా తీశాడు. చివరికి ఇతని బాగోతం బట్టబయలు కావడంతో.. స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.