IT Rides Again: గత కొంత కాలంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కేంద్ర దర్యాప్తు సంస్థల సీబీఐ, ఈడీ, ఐటీ ఆకస్మిక సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ఇవాళ భారీ స్థాయి సోదాలను ఐటీ శాఖ చేపట్టింది. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కార్యాలయంలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 45 లో కొనసాగుతున్న ఐటీ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, ఫైనాన్షియర్ తోపాటు పలువురి ఇళ్లలో ఐటీ సోదాలు చేపట్టారు.
Read also: Amala Paul: హీరోయిన్ ని గుడిలోకి రానివ్వని పూజారులు…
ఈరోజు ఉదయం ఐటి కార్యాలయం నుండి 30 టీములుగా బయలుదేరారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కన్స్ట్రక్షన్ కార్యాలయాలు, బిల్డర్ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఊర్జిత కన్స్ట్రక్షన్స్ , CSK బిల్డర్స్ తదితర కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లల్లో కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత కన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కార్యాలయంలో.. మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, CSK కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించుకొని ఐటీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గడిచిన ఐదు సంవత్సరాల ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకోని ఐటీ ఆరా తీస్తుంది. నెక్ట్ ఎవరు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ సంచలనంగా మారింది.
Read also: Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!
ఇటీవల జనవరి 4న (బుధవారం) ఎక్సెల్ గ్రూపు కంపెనీలపై ఐటీ బృందాలు 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వాహనాలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఐకియా షోరూమ్ పక్కనే ఉన్న ఎక్సెల్ కార్యాలయం, బాచుపల్లిలోని ఆరుగురు డైరెక్టర్లు, సీఈవో నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా ఎక్సెల్ గ్రూపునకు అనుబంధంగా ఉన్న మరో పది కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. సంగారెడ్డిలోని నాలుగు కంపెనీల్లో రబ్బర్ దిగుమతి, ఎగుమతిలో భారీ వ్యత్యాసాలతో పాటు పన్ను చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని సోదాలు నిర్వహించారు.
Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?
నార్సింగ్‌లో ఆరు చోట్ల, బాచుపల్లి, దుండిగల్‌లోని నాలుగు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. లండన్ నుంచి 500 కోట్ల నిధులు ఎక్సెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. అన్న లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. రాజకీయ నేతలకు సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు జరిగితే.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఆయా కంపెనీలు తమ ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నాయా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరిపి.. ఏమైనా తేడాలున్నట్లు గుర్తించి సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాలకు వెళ్లే ముందు ఈ విషయంలో పెద్ద కసరత్తు చేస్తారు.
Hyderabad Traffic Restrictions: ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే?