D. Sridhar Babu: రాజ్యాంగాన్ని తిరిగి రాయలన్న కుట్రలో బీజేపీ ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు చేరారు. ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఉన్న కాంగ్రెస్ లోకి ఇతర పార్టీ నాయకులు వస్తున్నారని తెలిపారు. మంథనికి ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు వస్తున్నారని తెలిపారు.ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ లపై మీ స్టాండ్ ఏంటో స్పష్టం చేయండన్నారు. ఓవైపు బలహీన వర్గాల రిజర్వేషన్ లు తీసేస్తామని చెబుతూనే వారి ఓట్లని ఎలా అడుగుతున్నారని తెలిపారు. రిజర్వేషన్ లని ఎత్తివేస్తామని చెబుతున్న బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.
Read also: Aashu Reddy: స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి…
కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలోనే పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో కాకా కుటుంబం చేస్తున్న సేవలపై ఏమాత్రం అవగాహన లేని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కాకా కుటుంబం ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, అవినీతికి పాల్పడుతోందని జేపీ నడ్డా పెదపడల్లి గడ్డపై నినదించారు. కాకా కాకా వెంకటస్వామి జైల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడారన్నారు. కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాకా కాకా ఫౌండేషన్, విశాఖ ట్రస్ట్‌ల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్‌లు రాష్ట్రంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తుంటే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు , కేంద్రంలో అదానీ, అంబానీల కోసం మోడీ పనిచేస్తున్నారు.
China Knife Attack: ఆసుపత్రిలో కత్తితో దాడి.. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు