NTV Telugu Site icon

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై దాడి కేసులో దర్యాప్తు…

మాదాపూర్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతోనే విషయం బయటికి రాకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికేలు నిర్వహిస్తున్న సమయంలో… మమల్ని ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై నే చేయి చేసుకున్నారు ఇద్దరు వాహనదారులు. దాంతో ఈ ఘటన పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అయితే ఆ ఇద్దరి పై కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. ఉన్నత ఆధికారులకు సంబంధించిన వారు కావడంతోనే వారి పై చర్యలు తీసుకోవడం లేదు అని ఆరోపణలు చేస్తున్నారు.