Water Supply: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈరోజు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించారు. మహానగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టులో సింగూరు నుంచి ఖానాపూర్‌కు వెళ్లే 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌లో వాల్వ్ దెబ్బతిందని వెల్లడించారు. ఈ వాల్వ్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నాయని. ఈ పనులు నేడు చేపట్టేందుకు వేగవంతం చేశారు. దీంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీనిని నగర ప్రజలు గమనించాలని, అధికారులకు సహకరించాలని కోరారు. ఓఅండ్ ఎం డివిజన్, షేక్ పేట్, టోలిచౌకి, గోల్కొండ, భోజగుట్ట రిజర్వాయర్, గంగడిపేట, కోకాపేట్, నార్సింగి, పుప్పాల గూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నాంపూర్, మంచిరేవు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Read also: Whatsapp UPI payments: నగదు పంపడం ఇక మంరింత సులభతరం చేసిన వాట్సాప్…!
మరోవైపు బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడి వాసులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నీటి వినియోగంపై ఆంక్షలు విధించిందంటే.. అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. స్నానానికి బదులు వైప్స్‌తో తుడుచుకోవడం, వంట సమన్లు ఎక్కువగా కడగకపోవడం, తినడానికి డిస్పీజబుల్ ప్లేట్స్ వాడుతూ.. జనాలు అడ్జస్ట్ అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా ఉందంటే.. ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాల ఏ రేంజ్‌లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.నీటి సమస్య కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి. దాంతో చాలామంది టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. అక్కడే ఉన్న వారు నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర రూ.600-800 ఉండగా.. ఇప్పుడు రూ.2000 డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు దేశవ్యాప్తంగా బెంగళూరు నీటి కష్టాలు హాట్ టాపిక్ అయ్యింది.
IPL 2024: అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’గా హార్దిక్ పాండ్యా!