V. Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్ళు, నీధులు, నియామకాలు కోసమన్నారు. అన్యాయం జరిగిందని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు అయిన కొన్ని అంశాలు పరిష్కారం కానివి ఉన్నాయన్నారు. 9 షెడ్యుల్ ఉన్న 30 సంస్థల ఇంత వరకు పరిష్కారం కాలేదన్నారు. పరిష్కారం కానివి ప్రభుత్వం దృష్టి పెట్టీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 10 షెడ్యుల్ 102 సంస్థకు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని తెలిపారు.
Read also: Team India Coach: బీసీసీఐకి ఘోర అవమానం.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకటే దరఖాస్తు!
9 షెడ్యుల్, 10 షెడ్యూల్ లో పరిష్కారం కాని సంస్థలను ఏంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తరువాత హైదరాబాద్ నుండీ ఆంధ్ర ప్రజలను వెళ్లగొడుతారు అని ప్రచారం చేశారని.. కేసీఆర్ అధికారంలో రాగానే ఆంధ్ర ప్రజలను చక్కగా చూసుకున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ది ఆటంకం లేకుండా పరిష్కారం చేసుకోని ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకొని వెళ్ళాలన్నారు. రాజకీయా ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, కొందరి ప్రయోజనాలు కోసం నిర్లక్ష్యం చేస్తే మేము ఊరుకోమన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యమన్నారు.
YS Jagan: రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన…(వీడియో)