NTV Telugu Site icon

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలక మలుపు

Tspsc Interesting Twist

Tspsc Interesting Twist

Interesting Twist Revealed In TSPSC Paper Leak Issue: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం తాజాగా కీలక మలుపు తీసుకుంది. నిందితుడు ప్రవీణ్ మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్టు తేలింది. సిట్ విచారణలో భాగంగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో భేటీ అయిన సిట్ చీఫ్.. లక్ష్మీ దగ్గర నుంచి పాస్‌వర్డ్‌ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్‌కి లబ్ది చేకూర్చేందుకు గాను.. కంప్యూటర్ లాన్‌లో రాజశేఖర్ పలు మార్పులు చేసినట్టు తెలిసింది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీన్ పేపర్స్ బాంచ్ కొట్టేశాడు. తన దగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఆ పేపర్స్‌ని ప్రవీణ్ సేవ్ చేసుకున్నాడు.

Etela Rajender: మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్.. ఇదే కేసీఆర్ పాలన

ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ ఎగ్జామ్ పేపర్‌తో పాటు మరికొన్ని పేపర్లను ప్రవీణ్ కొట్టేశాడు. 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్లను సైతం ప్రవీణ్ దొంగలించాడు. భవిష్యత్తులో జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను కూడా ప్రవీన్ తన దగ్గర పెట్టుకున్నాడు. సమయం చూసి, ఈ పేపర్లను విక్రయించాలని ప్రవీణ్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. భవిష్యత్తులో జరిగే పేపర్లన్నింటినీ ఇస్తానని రేణుకకి ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ పరీక్షలు రాయబోయే అభ్యర్తులను వెతికి.. బేరం మాట్లాడి పెట్టాలని రేణుకకు ప్రవీణ్ చెప్పినట్టు సిట్ విచారణలో బహిర్గతమైంది. మరింత సమాచారాన్ని రాబట్టడం కోసం సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

Amma Pregnant : అమ్మ ప్రెగ్నెంట్.. 23ఏళ్ల యువతికి తండ్రి శుభవార్త

కాగా.. తనకున్న సాన్నిహిత్యంతో రేణుక అనే యువతి అనే సోదరుడి కోసం ప్రశ్నాపత్రం అడగ్గా, ప్రవీన్ సిస్టమ్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసి, ఆ అమ్మాయికి నేరుగా వాట్సప్ చేశాడు. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ యువకుడు.. తన స్నేహితుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు తీసుకొని, వారికి ఆ ప్రశ్నాపత్రాన్ని పంపాడు. అయితే.. డబ్బులు ఇచ్చే విషయంలో తేడాలు రావడంతో, ఓ యువకుడు 100కు డయల్ చేసి, పేపర్ లీక్ విషయాన్నిచెప్పాడు. అలా ఈ లీకేజ్ వ్యవహారం బట్టబయలైంది.

Show comments