Student Vaibhav: నగరంలోని జిల్లెలగూడలో మంగళవారం ఇంటర్ విద్యార్థి వైభవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని ఆత్మహత్యకు ముందు వైభవ్ సూసైడ్ నోట్ రాశాడు. ఎక్కువ మార్కులు రాలేదని కాలేజీ యాజమాన్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో వైభవ్ పేర్కొన్నాడు. వైభవ్ హైదరాబాద్ చైతన్యపురిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ కాలేజీలో ఎవరూ చేరవద్దని కూడా ఆ లేఖలో వైభవ్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇంటర్ పరీక్ష రాకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. వైభవ్ ఆత్మహత్య వార్తను కుటుంబ సభ్యులకు కాలేజీ యాజమాన్యం తెలుసుపడంతో హుటాహుటిన కాలేజీ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఓత్తిడి కారణం గా నాకొడుకు సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ లెటర్ రాసాడు వైభవ్ అన్నారు. కాలేజ్ యాజమాన్యం మా బాబుని పోట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా వేధింపులు గురయ్యాయని తెలిపారు. తక్కువ మార్కులు వచ్చాయి మీ బాబును పంపిస్తున్న అని చెప్పారు మేనేజ్ మెంట్ అన్నారు. వేలకు వెలు పెట్టీ చదువించామని, మేనేజ్ మెంట్ వేదింపులు గురిచేసిందని మండిపడ్డారు. కానీ ఈ రోజు మా బాబు కోల్పోయామన్నారు. మరెవరు ఈ కాలేజీ లో జాయిన్ కావద్దనీ, విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దనీ.. ఇదే నా చివరి రోజనీ సూసైడ్ లెటర్ రాసాడని పేరెంట్స్ చెప్పుకొచ్చారు. చైతన్యపురి నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మృతదేహం కడలనివ్వమని తెలిపారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు..
చిన్నచిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో నమోదవుతున్నాయి. అయితే ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. మీకు ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, మీరు మానసిక వైద్యుడిని సంప్రదించమని సలహా ఇస్తారు. జీవితంలో ప్రతి సమస్యకు మరణం ఒక్కటే పరిష్కారం కాదు. మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే మరియు మీ జీవితంలో సహాయం కావాలంటే, వెంటనే అసరా హెల్ప్‌లైన్ ( +91-9820466726 ) లేదా ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. జీవితం విలువైనది.
Student Vaibhav: మార్కులు తక్కువ వస్తే వేధిస్తారా..? మృతదేహం కదలనీయం..!
