NTV Telugu Site icon

Inter student: పండుగ పూట విషాదం.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య.. వారే కారణమంటూ లేఖ

Inter Student Ded

Inter Student Ded

Inter student: ఏదో ఒక కారణం.. ఆందోళన.. మనిషిని ప్రాణం తీసేలా చేస్తుంది. సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతే అలా చేస్తోంది. ఈ కోణంలో, సమాజం చనిపోవాలనుకునే వారి ఆలోచనను రగిలించాలని కోరుకుంటుంది. చిన్న చిన్న కారణాలు ప్రాణాలే తీసుకునే పరిస్థితి వస్తుంది. గోరంత గొడవను కొండంతగా చూసి వాటిని ఆలోచిస్తూ అవమానం జరిగిందని, ఆవేశంతో తనువు చాలిస్తూ కుటుంబాలకు తీరని శోకాన్ని నింపుతున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

Read also: Ranga Maarthaanda Movie: రంగమార్తాండ మూవీ రివ్యూ

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలురా గ్రామంలో ఇంటర్‌ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. రోజూలాగానే నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్లింది. అయితే మిగతావారు కూడా కుళాయి వద్దకు చేరుకుని నీళ్లు పడుతున్న సమయంలో ఒకనొకరు నేనంటే నేను ముందు అంటూ గొడవకు దిగారు. అయితే వైష్ణవితో శోభ అనే మహిళ గొడవకు దిగింది. అయితే ఆ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానైంది. శోభతో పాటు సురేష్ అనే వ్యక్తి కూడా గొడవలకు దిగారు. దీంతో అందరిముందు తనతో వీరిద్దరూ గొడవ చేయడంతో.. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. దీంతో ఇంటర్‌ విద్యార్థి వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురైంది. శోభ, సురేష్ ఇద్దరు వైష్ణవిపై కేసు పెట్టడంతో ఇక పోలీస్టేషన్‌ కు వెళ్లాలా అని ప్రశ్నించుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు పోలీసుల కేసు భయంతో ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్‌ అయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు శోభ, సురేష్‌ కారణం అంటూ సూసైడ్ నోట్ రాసింది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శోభ, సురేష్‌ లను విచారిస్తున్నారు. అసలేం జరిగిందనేది వారిని ప్రశ్నిస్తున్నారు. శోభ, సురేష్‌ లను కఠినంగా శిక్షించాలని వైష్ణవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Lionel Messi : మెస్సీపై పడ్డ అభిమానులు.. ఉక్కిరిబిక్కిరైన ఫుట్ బాల్ స్టార్

Show comments