Site icon NTV Telugu

Hyderbad Narayana Junior College: దారుణం.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి

Hyderbad Narayana Junior College

Hyderbad Narayana Junior College

హైదరాబాద్‌ రామంతాపూర్‌ లోని నారాయణ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను విద్యార్థి తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రిన్సిపాల్‌ బయటకు వెల్లడానికి ప్రయత్నించగా ప్రిన్సిపాల్‌ నుకూడా పట్టుకున్నాడు. అయితే విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ రెడ్డి, ఏవో ఆశోక్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ముగ్గురుకి తీవ్రగాయాలు కావడంతో.. కాలేజీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థులు మాట్లాడుతూ.. ఫీజు కట్టలేదని టీసీ ఇవ్వకుండా ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ రెడ్డి వేధించాడని ఆరోపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో బయలు దేరారు. ప్రిన్సిపాల్‌ తీరు వల్లే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ టీసీ ఇచ్చింటే ఈఘటన జరిగేది కాదంటూ.. ప్రిన్సిపాల్‌ తీరుపట్లు అసహనం వ్యక్తం చేసారు విద్యార్థులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఎటువంటి ఉద్రిక్తత చోటేచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
V. Hanumantha Rao : నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారు..

Exit mobile version