Occult Worship: హైదరాబాద్ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో దానికి కారణం క్షుద్రపూజలే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జియాగూడ ప్రాంతానికి చెందిన నవ్య ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. అప్పటి వరకు అందరితో ఆనందంగా గడిపిన నవ్య.. తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కిందకు దించారు. అప్పటిదాకా సరదాగా కనిపించిన నవ్య.. కొద్దిసేపటికే శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు.
Read also: Viral videos: అరె ఏంట్రా ఇది..విస్కీని ఇలా తింటారా..?
అయితే.. క్షుద్ర పూజల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని నవ్య తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. నవ్య చదువులో చురుగ్గా ఉండేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత గురువారం అమావాస్య రోజున కొందరు నిమ్మకాయలు, నల్లబొమ్మలతో తమ ఇంటి ముందు పడేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అప్పటి నుంచి నవ్య పూర్తిగా డిస్టర్బ్ అయ్యిందన్నారు. అయినా కుటుంబ సభ్యులతో సరదాగా వున్న నవ్వ రాత్రి గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కళ్లు మూసుకున్నా, తెరిచినా అవే కనిపిస్తున్నాయని నవ్య అనేదని చెప్పారు. ఇంటి ముందు నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపించకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రోదించారు. భయంతో నవ్వ ఇంత పని చేస్తుందని ఊహించలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అది జరిగిన రెండు రోజులు అవే మాటలు మాట్లాడేదని వాపోయారు. అయినా మేమంతా నవ్వ మాటలు లైట్ తీసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంటి ముందు నవ్వ అవిచూసి ఉండకపోతే బతికి ఉండదనే తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నవ్వ ఇంటికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని నవ్వ ఆత్మహత్యకు గల కారణాలు నిజంగా క్షుద్రపూజలా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Shampoo Sachet Vs Bottle: షాంపూ ధర రూ. 2 .. ధనవంతులయ్యే సింపుల్ ఐడియా
