తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేది నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమీక్షించారు. ఈ సమీక్షలో ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ శ్రీ. కృష్ణ ఆదిత్య, జిల్లాల కలెక్టర్ లు, డిజిపి తెలంగాణ, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ లు. జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షా నిర్వహణ కమిటీలు వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Also Read:Krithi Shetty: తెలుగొద్దు.. తమిళమే ముద్దు!
ఇంటర్ పరీక్షలపై జరిపిన సమీక్షలో సీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని, పరీక్షలు సజావుగా జరిపేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, జిల్లా అధికారులతో పరీక్షా నిర్వహణకు సమీక్షాసమావేశాలు నిర్వహించి రెవెన్యూ, పోలీస్, పోస్టల్, వైద్య, రవాణా, విద్యుత్ అధికారులకు ముందస్తు ఏర్పాట్లకై సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read:England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా
చేతి గడియారంతో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవన్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ లను అనుమతించడం, ఉపయోగించడంపై నిషేదం విధించామన్నారు. బోర్డ్ అధికారులు ముందస్తుగా అనుమతించిన విద్యార్ధులకు సహాయకులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా 24/7 పర్యవేక్షించి.. అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.