NTV Telugu Site icon

ఆ కళాశాలలపై చర్యలు తప్పవు : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్

స్పాట్ వాల్యుయేషన్ కి స్టాఫ్ ని పంపించని కళాశాలల పై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ సిబ్బంది ని పంపించలేదని, పంపించాలని ఆదేశించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రిపోర్ట్ చేయని సిబ్బందికి, ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు.

రేపు ఉదయం వరకు సిబ్బందిని రిలీవ్ చేయకున్న, సిబ్బంది రిపోర్ట్ చేయకపోయిన క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. స్పాట్‌ వాల్యువేషన్‌ కోసం ప్రభుత్వ సెక్టార్‌, ప్రైవేటు కళాశాలల నుంచి సిబ్బందిని పంపించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కోరింది. ఇలా కోరినప్పటికీ స్పందించని కళాశాలలకు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు పై విధంగా ప్రకటించారు.