Site icon NTV Telugu

Asian Spine Hospital: ఇండియాలోనే తొలి ఎండోస్కోపిక్ స్పైన్ ఆస్పత్రి.. మన హైదరాబాద్‌లో..!!

Asian Spine Hospital

Asian Spine Hospital

దీర్ఘకాలంగా వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్.. ఏషియన్ స్పైన్ ఆస్పత్రి వారు భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో సమగ్ర స్పైన్ అండ్ పెయిన్ కేర్ కోసం జూబ్లీహిల్స్‌లో ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఈ సెంటర్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఫౌండర్, ఛైర్మన్ డి.నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. రోగులకు నాణ్యమైన, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఏషియన్ స్పైన్ సెంటర్ కట్టుబడి ఉందని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

వెన్నెముక సమస్యలతో బాధపడేవారి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త వైద్య, శస్త్ర చికిత్స ఎండోస్కోపిక్ సాంకేతికతలను కలపడం ద్వారా సంపూర్ణ స్థాయిలో వైద్యం అందిస్తున్నామని ఏషియన్ స్పైన్ సెంటర్ ఛైర్మన్, ఎండీ సుకుమార్ సూర వెల్లడించారు. స్పైన్ సర్జరీపై సమాజంలో చాలా అపోహలు ఉన్నాయని.. పూర్తిస్థాయి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో అపోహలను తొలగించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్పైన్ సెంటర్ అని వివరించారు. సాధారణ వెన్నెముక సమస్యల నుంచి అత్యంత సంక్లిష్టమైన వెన్నెముక రుగ్మతల వరకు తాము చికిత్స అందిస్తామన్నారు. తమ శస్త్రచికిత్స విధానాలలో జీవితాన్ని అస్తవ్యస్థం చేసే నొప్పి, తీవ్రమైన వెన్నెముక సమస్యలతో సహా ఎముక స్పర్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, క్రానియో వెర్టెబ్రల్ జంక్షన్ అనోమాలిస్, డిజెనరేటివ్ డిస్క్ డిసీజ్ వంటి అన్ని రకాల చికిత్సలను అందిస్తామని సుకుమార్ సూర పేర్కొన్నారు.

మరోవైపు సెంటర్ ఆఫ్ ఎక్ లెన్స్‌గా RIWO స్పైన్ జర్మనీ ద్వారా తమ ఏషియన్ స్పైన్ సెంటర్ గుర్తింపు పొందినట్లు ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ పగిడిమర్రి నరేష్‌కుమార్ తెలిపారు. తాము పూర్తి స్థాయిలో 4కే ఇమేజింగ్ టెక్నాలజీ, అంతర్గత ఎండోస్కోపిక్ స్పైన్ సర్జికల్ ఇన్నోవేషన్‌ను తమ ఆస్పత్రి అందిస్తున్నట్లు తెలిపారు. తమ నిపుణులకు ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్సలలో 2వేల కంటే ఎక్కువ కేసుల అనుభవం ఉందన్నారు.

Exit mobile version