Site icon NTV Telugu

Indian Racing League: హుస్సేన్‌సాగర్ తీరంలో మళ్లీ సందడి.. దూసుకెళ్లనున్న రేసింగ్‌ కార్లు

Car Resing

Car Resing

Indian Racing League: హైదరాబాద్​ హుస్సేన్‌సాగర్ తీరంలో కార్ రేసింగ్​కు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇవాల్టి నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని, ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. ఇక.. గత నెల 19, 20 తేదీల్లో హైదరా బాద్ లో తొలి రౌండ్ జరిగింది.

Read also: Mandous Cyclone Live Updates: మాండూస్‌ విలయం.. లైవ్‌ అప్‌డేట్స్‌

ఇందులో భాగంగా.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. ట్రాక్లో ఎలాంటి మార్పులు చేయట్లేద కఠినమైన భద్రత నిబంధనల్ని పాటిస్తూ తుది దశ పోటీల్ని పూర్తిచేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇండియాలో మొదటి సారి జరుగుతున్న లీగ్ రేస్‌లను హైద్రాబాద్, చెన్నైలో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రౌండ్ హైదరాబాద్ లో నిర్వహణ లోపం కారణంగా మొదటి రౌండ్ రేస్ జరగలేదు. ప్రాక్టీస్ రేస్‌లతోనే ముగిసింది. నవంబరు 25-27 వరకు రెండో రౌండ్, ఈనెల 2-4 వరకు మూడో రౌండ్ రేసులకు చెన్నై ఆతిథ్యమిచ్చింది. రేసింగ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11 తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Cyclone Mandous: తీరం దాటిన మాండూస్‌ తుఫాన్‌.. ఆ రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్

Exit mobile version