NTV Telugu Site icon

హైదరాబాద్ కేంద్రంగా మరో టీకా ఉత్పత్తి… 

హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారిన సంగతి తెలిసిందే.  భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లు కరోనా టీకా కేంద్రాలుగా మారాయి.  ఇప్పుడు  బయోలాజికల్ ఈ సంస్థ సొంతంగా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.  బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉన్నది. ఇకపోతే, ఈ వ్యాక్సిన్ తో పాటుగా అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను కూడా బయోలాజికల్ ఈ సంస్థ ఉత్పత్తి చేసేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం.  జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.  సంవత్సరానికి 60 కోట్ల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది.  అయితే, ఈ టీకాలు ఎప్పటి నుంచి ఉత్పత్తి చేయనున్నారనే విషయాలను సంస్థ బయటపెట్టలేదు.