Site icon NTV Telugu

New secretariat: సెక్రటేరియట్ కట్టడానికి వాడిన మెటీరియల్.. అంతస్తుల వారీగా వివరాలు

New Secretariat

New Secretariat

Telangana new secretariat: మధుర ఘట్ట తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, పరిపాలనా భవనం దృఢంగా నిలిచి రాజ్యమేలుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటలకు సింహ లగ్న ముహూర్తంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు.

సెక్రటేరియట్ కట్టడానికి వాడిన మెటీరియల్ ఇదే!

ఉక్కు: 8,000 మెట్రిక్ టన్నులు
సిమెంట్: 40,000 మెట్రిక్ టన్నులు
ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు)
కాంక్రీటు: 60,000 క్యూబిక్ మీటర్లు
ఇటుకలు: 11 లక్షలు
ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు
గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
మార్బుల్: లక్ష చదరపు అడుగులు
ధోల్పూర్ రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు
కలప: 7,500 క్యూబిక్ అడుగులు
ఉద్యోగులు: మూడు షిఫ్టులలో 12,000 మంది

సెక్రటేరియట్‌లో అంతస్తుల వారీగా డిపార్ట్‌మెంటల్ వివరాలు :

గ్రౌండ్ ఫ్లోర్: ఎస్సీ మైనారిటీ, కార్మిక, రెవెన్యూ శాఖలు

1వ అంతస్తు: విద్య, పంచాయత్ రాజ్, హోం శాఖ

2వ అంతస్తు: ఆర్థిక, ఆరోగ్యం, ఇంధనం, పశుసంవర్ధక శాఖ

3వ అంతస్తు: పారిశ్రామిక మరియు వాణిజ్య విభాగం, ప్రణాళికా విభాగం

4వ అంతస్తు : అటవీ, సాంస్కృతిక శాఖ, నీటిపారుదల శాఖ, న్యాయ శాఖ

5వ అంతస్తు: R&B, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు

6వ అంతస్తు: CM, CS, CMO, PRO, సిబ్బంది కార్యాలయాలు

మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 వరకు శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. యాగం పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం సీఎం ఛాంబర్‌లోని తన సీటులో కూర్చుని సంతకం చేయనున్నారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య మంత్రులు, అధికారులు తమ తమ సీట్లలో కూర్చుని సంతకాలు చేస్తారు. 2:15 గంటలకు అధికారులు, సిబ్బంది సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 2:15 నుంచి 2:45 మధ్య అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:45 గంటల నుంచి భోజనం అందిస్తారు.
Telangana new secretariat: సచివాలయం నలుదిక్కులా ద్వారాలు.. దేనిలోనుంచి ఎవరు వస్తారంటే ?

Exit mobile version