Site icon NTV Telugu

నల్లగొండలో నిత్య పెళ్లికొడుకు..

నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న ఓ నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. నల్లగొండ క్లాక్‌ టవర్‌ సెంటర్‌ చర్చి లో పియానో వాయిస్తున్న విలియమ్స్‌… అనేక మంది మహిళ లను ట్రాప్‌ చేశాడు. చర్చికి వచ్చే మహిళలను లోబర్చు కున్నాడు. విలియ మ్స్‌ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో .. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. చర్చికి వచ్చే మహిళలపై విలియమ్స్‌ కన్ను పడింది.

పియానో వాయిస్తూ వారిని ఆకట్టుకున్నాడు. అలా ఏకంగా 19 మందిని మోసం చేశాడు. కొంతమందిని పెళ్లి చేసుకున్నాడని సమాచారం. వా రిని లోబర్చుకుని తన కోరికలు తీర్చుకునేవాడు. వారు అంగీకరించ కుంటే బెదిరించి అఘాయిత్యానికి పాల్పడేవాడని తెలుస్తోంది. ఈ వి షయం తెలిసిన తనూజ నల్లగొండ వన్‌ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చే సింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలియమ్స్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెల్సుకుని గుండె పోటు వచ్చిందని ఆస్పత్రిలో చేరాడు. కాగా పోలీసులు ఆస్పత్రి నుంచి విలియమ్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన నల్లగొండలో చర్చనీయాంశం అయింది.

Exit mobile version