Siva Balakrishna Case: ఆదాయానికి మించిన అక్రమార్జన కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఆయన అనుచరులను ఏసీబీ విచారిస్తోంది. హెచ్‌ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్‌లు శివబాలకృష్ణ బినామీలని అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరి పేరుతో చాలా భూములు, స్థలాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. వేలానికి ముందే అధికారులు పలువురు రియల్టర్లకు సమాచారం అందించారని, పలువురు రియల్టర్లకు భూములు దక్కేలా అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు వేలంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
Read also: Rangareddy: జాన్వాడలో ఉద్రిక్తత.. ఈనెల 21వరకు 144 సెక్షన్..
వేలం వేసిన భూములపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేపట్టింది. వేలం సమయంలో శివ బాలకృష్ణ హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్నారు. భూముల వేలంతోపాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేరవేశారు. హెచ్‌ఎండీఏలో పలువురు అధికారుల పాత్రపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది. ఇదిలావుండగా శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ ఇప్పటికే లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిపై కూడా ఏసీబీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యం సేవిస్తూ..!
