NTV Telugu Site icon

K. A. Paul: నేను బిజీ నావద్దకు రావద్దు…సెల్ఫీలు దిగొద్దు ప్లీజ్

Ka Paul

Ka Paul

K. A. Paul: మునుగోడులో పోలింగ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఉదయం 6 గంటలనుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మునుగోడు నియోజక వర్గంలో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక మునుగోడులో కేఏపాల్‌ హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిశీలిస్తూ ముందుకు సాగారు. చౌటుప్పల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని స్వతంత్ర అభ్యర్థి కే.ఏ.పాల్‌ సందర్శించారు. పరుగులు పెడుతూ కనిపించారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. నేను బిజీగా వున్నాను. మీతో మాట్లాడలేక పోతున్నందుకు క్షమించండి సాయంత్రం ఆరు గంటల తరువాత మాట్లాడుతాను. నాతో సెల్ఫీలకు నాదగ్గరకు రాకండి ఇప్పుడు సెల్ఫీలుదిగే టైమ్‌ కాదంటూ చెప్పారు. మునుగోడు నియోజక వర్గంలో భారీగా డబ్బులు పట్టుపడుతున్నా వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు కే.ఏ.పాల్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేఏ పాల్ చేతి వేళ్లన్నింటికీ ఉంగరాలు ధరించి రాగా.. ‘మీది ఉంగరం గుర్తు. చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడం రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా?’ అని రిపోర్టర్లు ప్రశ్నించారు. ‘TRS వాళ్లు బయట కార్లలో తిరుగుతున్నారు. వాళ్లు కార్లలో రాకుండా సైకిళ్ల మీద వస్తారా?’ అని పాల్ సమాధానమిచ్చారు. అనంతరం ఇంకో బూత్ చూడాలని చెబుతూ.. పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు..

Read also: Special Story on Netflix vs Disney: ఓటీటీ పోటీ.. ఓడేదెవరు? గెలిచేదెవరు?

పోలింగ్‌ కేంద్రాలన్నీ ఓటర్లతో నిండిపోయాయి. పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాలో ఏవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అరగంట పాటు ఓటు వేసేందుకు లైన్లో వైట్‌ చేశారు. అయితే ఇప్పటికే మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ చండూరు మండలంలో ఇడికూడలో 173వ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చండూరులోని పోలింగ్‌ కేంద్రాలను రాజగోపాల్‌ రెడ్డి పరిశీలించారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Show comments