Site icon NTV Telugu

Lizard at Dinner: వర్థన్నపేట బాలికల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత..! రాత్రి భోజనంలో బల్లి..?

Vadhannapet

Vadhannapet

వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్‌ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే వారిలో 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా వుండంటతో.. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించారు. సోమవారం రాత్రి భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు. ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. యాజమాన్యం వర్ధన్నపేట ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలియగానే ఎమ్మెల్యే అరూరి రమేష్ హాస్పిటల్ కి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థునులు 9వ తరగతి విద్యార్థిని M కళ్యాణి, పదివ తరగతి B సరిత, ఎనిమిదవ తరగతి దివ్య, ఐదవ తరగతి చతువుతున్న శిరీష తదితర విద్యార్థినిల పరిస్థితి విషమంగా వుందని సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. బల్లి పడిన ఆహారాన్ని పిల్లలకు ఎలా తినిపిస్తారని వాదించారు. కడుపు నొప్పితో పిల్లలు అల్లాడుతున్నారని వాపోయారు. విద్యార్థులకు ప్రథమచికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. విద్యార్థుల పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
Sonali Phogat Case: మరో ఊహించని ట్విస్ట్.. డైరీలో వారి పేర్లు

Exit mobile version