NTV Telugu Site icon

Bandi sanjay: ఒక్క ఛాన్స్.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం కొంపల్లిలో జరుగిన ‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’లో బండి సంజయ్ మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తామన్నారు. వెంటనే పీఆర్సీ వేస్తాం 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిస్తారని, మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయిస్తాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో ఉన్న కేసీఆర్ కు టీచర్ల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. ఓటనే ఆయుధంతో కేసీఆర్ చెంప చెళ్లమన్పించాలని కోరారు. మీ అందరి ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతోందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించి మాత్రమే కావు.. అసెంబ్లీ ఎన్నికల వరకు మరే ఎన్నికల్లేవు.. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి.

Read also: Kavita Deeksha: ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి దీక్ష.. మహిళా బిల్ ప్రవేశపెట్టాలని డిమాండ్

తెలంగాణలో పేదలు పడుతున్న బాధలను గుర్తు చేసుకుని ఓటేయండి అని తెలిపారు. గత పాలకులు ముఖ్యంగా సీఎం నోట ఏ మాట వచ్చినా కచ్చితంగా అమలయ్యేదన్నారు. కానీ కేసీఆర్ నోట ఏ మాట వచ్చినా ఇక అంతే సంగతులు. పంజాబ్ కు చెక్కులు పంచితే చెల్లలేదు. పాకిస్తాన్, శ్రీలంక, చైనా గురించి గొప్పగా మాట్లాడితే.. ఆ దేశాలు అడుక్కునే తినే స్థాయికి వచ్చాయన్నారు. కేబినెట్ లో ఇండ్ల జాగా ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షలు చొప్పున ఇస్తాడట, దళిత బంధు ఇస్తాడట, నిలువ నీడ లేని పేదోళ్లకు ఇండ్లు కట్టియ్యని కేసీఆర్.. ఆ డబ్బులు ఇస్తానంటే నమ్మేదెవరు? అంటూ ఎద్దేవ చేశారు. కేబినెట్ మీటింగ్ లో టీచర్ల సమస్యలనే కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పీఆర్సీ ఊసే లేదన్నారు. కేసీఆర్ కు టీచర్లపట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్ధమైతుందని, కసితో బీఆర్ఎస్ ను ఓడించండి అంటూ పిలుపు నిచ్చారు. ఈసారి ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే పీఆర్సీ వేయరని, రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తాడని తెలిపారు. డీఏలు ఇవ్వడు, 317 జీవోతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తూనే ఉంటాడన్నారు.. దయచేసి అన్నీ ఆలోచించి ఓటేయండని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండని కోరారు.
Astrology: మార్చి 10, శుక్రవారం, దినఫలాలు

Show comments