NTV Telugu Site icon

Telangana Govt: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..

Telangana Govt

Telangana Govt

Telangana Govt: వైయస్ఆర్ జయంతి కానుకగా కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకు మార్చి నెలలో రావావల్సి జీవో పాత తేదీతో ఇవాళ జీవోను సర్కార్ జారీ చేసింది. ఇన్నాళ్లు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీవో పెండింగ్ లో ఉంది. అయితే పాత తేదీలోనే 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకాన్ని ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. జీవోలో నేరళ్ళ శారద పేరు లేకపోవడం గమనార్హం. పార్లమెంట్ ఎన్నికల ముందు మహిళా కమిషన్ చైర్మన్ గా శారద పేరు ప్రకటించింది. మహిళా కమిషన్ కాబట్టి పూర్తి స్థాయి కమిషన్ వేసే ఆలోచనలో సర్కార్ ఉందని తెలుస్తుంది.

Read also: Abhishek Sharma Bat: సెంచరీ చేసిన బ్యాట్ నాది కాదు.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎవరెవరికి ఏఏ కార్పోరేషన్ అంటే..

1. ఎస్.అన్వేష్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ

2. కాసుల బాలరాజు – తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

3. జంగా రాఘవరెడ్డి – తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్

4. మనాల మోహన్ రెడ్డి – తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్

5. రాయల నాగేశ్వరావు – తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

6. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ – తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్

7. మెట్టు సాయి కుమార్ – తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్స్ ఫెడరేషన్ లిమిటెడ్

8. MD. రియాజ్-తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్

9. పొడెం వీరయ్య – తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ

10. కాల్వ సుజాత -తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్

11. ఆర్. గురునాథ్ రెడ్డి – తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

12. N. గిరిధర్ రెడ్డి – సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ & ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ (SETWIN)

13. జనక్ ప్రసాద్ – తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి

14. M. విజయ బాబు – తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్

15. నాయుడు సత్యనారాయణ – తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్

16. అనిల్ ఎరావత్ -తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

17. టి. నిర్మలా జగ్గారెడ్డి – తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్

18. ఐతా ప్రకాష్ రెడ్డి -తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్

19. మన్నె సతీష్ కుమార్ – తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

20 చల్లా నరసింహారెడ్డి – తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కో-ఆపరేషన్ లిమిటెడ్

Read also: Jagga Reddy: చేతిలో తల్వార్‌తో స్టేజ్‌ పై స్టెప్పులేసిన జగ్గారెడ్డి..

21. కె. నరేందర్ రెడ్డి – శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

22. ఇ.వెంకట్రామి రెడ్డి – కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

23. రాంరెడ్డి మల్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

24. పటేల్ రమేష్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ

25. M.A. ఫహీమ్ – తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్

26. బండ్రు శోభారాణి – తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్

27. M. వీరయ్య – తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్

28. కె. శివసేన రెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ

29. అలేఖ్య పుంజల – తెలంగాణ సంగీత నాటక అకాడమీ

30. ఎన్. ప్రీతమ్ – తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

31. నూతి శ్రీకాంత్ – తెలంగాణ స్టేట్ BC కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

32. బెల్లయ్య నాయక్ – తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

33. కొట్నాక తిరుపతి – తెలంగాణ స్టేట్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

34. జెరిపేట్ జైపాల్ – తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.

35. M.A. జబ్బార్ – మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్
Abhishek Sharma Bat: సెంచరీ చేసిన బ్యాట్ నాది కాదు.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!