CM Revanth Reddy: రచయిత అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా సీఎం అందెశ్రీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ, ఆ తరువాత మీడియా మధ్యమం ద్వారా కలిశాం.. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించింది అన్నారు. అందెశ్రీకి సముచిత న్యాయం కల్పిస్తాం.. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. జీవితాంతం తెలంగాణ కోసం జీవించిన వ్యక్తి.. కళాకారుడిగా, రచయితగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Old Man Argues Women: నా సీటు.. నాకు ఇవ్వాల్సిందే.. ఉచిత బస్సులో మహిళతో పెద్దాయన లొల్లి
ఇక, తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ కీర్తీ శాశ్వతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన రచించిన రచనలు 20 వేల నిప్పుల వాగు పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో పెడతాం అన్నారు. అందెశ్రీ అభిమానుల నుంచి సూచనలు తీసుకుంటాం.. ఏనాడు ఆర్థిక ఇబ్బంది గురించి ఆరోగ్యం గురించి ఆలోచించని వ్యక్తి అందెశ్రీ.. అతడ్ని కోల్పోవడం బాధాకరంగా ఉంది.. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేక రాశా, ఈ విషయంపై ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తాను.. అందుకు కేంద్రమంత్రులు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు.
