NTV Telugu Site icon

V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి..

V.hanumantha Rao

V.hanumantha Rao

V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి అని మాజీ ఎంపీ వి.హనుమంత రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకం అని మోడీ అంటున్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకం అంటున్నారని గుర్తుచేశారు. చని పోయిన రాజీవ్ గాంధీ ఇప్పుడు వస్తాడా? అని ప్రశ్నించారు. చనిపోయిన రాజీవ్ గాంధీ పై ఇప్పుడు బీజేపీ రాజకీయం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చని పోయిన రాజీవ్ గాంధీ ఇప్పుడు వచ్చి చెప్తడా? అని ప్రశ్నించారు. అసలు మోడీ ఓబీసీ నాయకుడి గా రిజర్వేషన్ల కు అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని అన్నారు. ప్రధాన మంత్రి స్థాయికి దిగజారి మోడీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ.. బీసీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బీజేపీ కులగణన కు ,రిజర్వేషన్లకు అనుకూలమా ? వ్యతిరేకమా చెప్పాలని ప్రశ్నించారు. హిందు అని దేశాన్ని విడగొట్టాలని మోడీ చూస్తుంటే.. అందరిని కలపాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని అన్నారు. కులగణన సరిగా జరగట్లేదని నాదెండ్ల భాస్కర్ రావు అంటున్నారు.. ఆయన అగ్రకులాల నాయకుడు అందుకే అలా మాట్లాతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన చేయాలా వద్దా నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలని ప్రశ్నించారు.
Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు..

Show comments