NTV Telugu Site icon

Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వహిస్తే సహించం.. అధికారులపై ఉత్తమ్ కుమార్ ఫైర్..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చే పనులు నత్త నడకన సాగడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద నాగర్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. గండి పూడ్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి… ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సీ ఉండగా.. ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. గండిపూడ్చివేత పనులు జరుగుతున్న తీరుపై మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పూడ్చివేత పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజనీర్లపై ఎందుకు చర్య తీసుకోకూడదని అన్నారు. పనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నిరోజుల్లో పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. గత వారం రోజులుగా పనులు చేస్తూనే వున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
Read also: Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్‌కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..