NTV Telugu Site icon

Traffic Diversion: వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Diversion

Traffic Diversion

Traffic Diversion: ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ అంక్షలను విధించారు. ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఫలక్‌నుమా నుండి వోల్టా హోటల్ వరకు, యాహియా పాషా దర్గా నుండి వోల్టా హోటల్ వరకు, మక్కా మసీదు నుండి హజ్ హౌస్ మరియు పట్టరగట్టి అలీజా కోట్ల వరకు ఊరేగింపులు ఉంటాయి. ప్రధాన ఊరేగింపు సయ్యద్ క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీ, ఫలక్‌నుమా నుండి ప్రారంభమవుతుంది. అలియాబాద్ ఎక్స్ రోడ్స్, లాల్ దర్వాజా ఎక్స్ రోడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్ బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ మీదుగా ర్యాలీ సాగనుంది. ర్యాలీ బీబీ బజార్‌, ఎటెబార్‌ చౌక్‌ వద్ద ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్డు మీదుగా కందికల్ గేట్, పెసలబండ, కర్నూలు రోడ్డు మీదుగా షంషీర్‌గంజ్, నాగుల చింత మీదుగా మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవాణా సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9010203626కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Hyderabad Crime: నాచారంలో దారుణం.. హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య

Show comments