Golconda Bonalu: ఆషాఢ మాస బోనాల పండుగకు గ్రేటర్ నగరం కళకళలాడుతోంది. ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డప్పువాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కోలాహలంగా ఊరేగింపు సాగుతుంది. పండుగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, హెల్త్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ అధికారులు విధుల్లో పాల్గొంటారు. గోల్కొండ కోటలో మొత్తం 20 మొబైల్ టాయిలెట్లు, ఐదు హెల్త్ క్యాంపులు, మూడు అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు.
Read also: Gujarat : సూరత్‌లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
ట్రాఫిక్ మళ్లింపు
గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. కోటకు వచ్చే భక్తులు రామ్ దేవ్ గూడ మక్కాయ్ దర్వాజా నుంచి వచ్చి రామ్ దేవ్ గూడలో పార్కింగ్ చేయాలని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) తెలిపారు. లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఫతే దర్వాజా వద్ద పార్క్ చేయాలి. 7 టూంబ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను బంజారా దర్వాజ వద్ద ఆపాలని షేక్ పెటనాల సూచించారు. కోటలో మొత్తం 650 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 25 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు అశ్విక దళం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
Read also: MS DHONI Movie Rerelease : ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..
భక్తులకు తాగునీరు..
గోల్కొండ బోనాల పండుగకు తాగునీటిని అందించేందుకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట మెట్ల నుంచి ప్రారంభమై బోనాలు వరకు వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. వంట చేసే ప్రాంతంలో ఇందుకోసం డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైపులైన్లు, స్టాండ్‌లు సిద్ధం చేశారు. పైపులైన్ల ద్వారా నీటి సరఫరాకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అదనంగా, నీటి ప్యాకెట్లు మరియు గ్లాసులు అందుబాటులో ఉన్నాయి మరియు నీటి క్యాంపుల సమీపంలో టెంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యత మేరకు నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో రాందాస్ బధిఖానా, చోటాబజార్, జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్‌హౌస్‌లో తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు జలమండలి సీనియర్ అధికారి తెలిపారు.
MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి