NTV Telugu Site icon

TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Arunachalam Tgsrtc

Arunachalam Tgsrtc

TGSRTC Tour Package: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. ప‌ర‌మ‌శివుణి ద‌ర్శ‌నం కోసం అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ టూర్ ప్యాకేజీని #TGSRTC యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క‌స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించే సౌక‌ర్యాన్ని సంస్థ క‌ల్పిస్తోంది. తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్ల‌గొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణ‌మి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం త‌ర్వాత కార్తీక పౌర్ణ‌మి పర్వ‌దినం నాడు అరుణాచ‌లానికి చేరుకుంటాయి.

Read also: Hemoglobin Levels: మీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే అనర్థాలు ఇవే

అరుణాచ‌ల గిరి ప్ర‌దక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చని తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్ర‌దించ‌గ‌లరని స్పష్టం చేశారు. టికెట్ ధర ఎంత ఉంటుంది అనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. ఫోన్ చేస్తే టూర్ ప్యాకేజీ వివరాలు వివరిస్తామని పేర్కొన్నారు. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా తగ్గించినట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. పల్లె వెలుగు బస్సు కిలోమీటరుకు రూ.11, ఎక్స్‌ప్రెస్‌ రూ.7, డీలక్స్‌ రూ.8 తగ్గిందని, సూపర్‌ లగ్జరీకి రూ. 6, రాజధాని రూ.7 వరకు తగ్గినట్లు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. ఏపీలో పంచారామాల కోసం ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 30-40 మంది భక్తులు ఉంటే వారు కోరిన తేదీల్లో పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావట్లేదు..

Show comments