NTV Telugu Site icon

Burra Venkatesham: గ్రూప్‌ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు..

Burra Venkatesham

Burra Venkatesham

Burra Venkatesham: గ్రూప్‌ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. గ్రూప్ 2కు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. 1368 సెంటర్ లు, 49 వేల 843 మంది సిబ్బంది వున్నారని అన్నారు. మొత్తం 75 వేల మంది ఇందులో భాగస్వామ్యం అవుతారని తెలిపారు.
ఇప్పటి వరకు 75 శాతం మంది హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. 783 పోస్ట్ లకి నియామక పరీక్షకు.. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టీజీపీఎస్సీపై విశ్వాసంతో, ధైర్యంతో పరీక్ష రాయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి ఎంఆర్వో షీట్ వారికి ఉంటుందన్నారు.

Read also: Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణ.. శ్రీతేజని పరామర్శించనున్న అల్లు అర్జున్

బయో మెట్రిక్ తప్పని సరి అన్నారు. రేపు, ఎల్లుండి పరీక్ష నిర్వహణ ఉంటుందని తెలిపారు. వేగంగా గ్రూప్-2 పలితాలు విడుదల చేస్తామని అన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో సర్వీస్ కమిషన్ ఢిల్లీకి పర్యటన ఉంటుందని అన్నారు. జాతీయ స్థాయి రిక్రూట్ మెంట్ ఏజెన్సీలను కలుస్తామన్నారు. ఈనెల 18 న యూపీఎస్సీకి వెళతామన్నారు. ఆ తరవాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను కలుస్తామని తెలిపారు. డిసెంబర్ 19న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఛైర్మన్ ను, ఆ రోజు సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ను కలుస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. జనవరి చివరి నాటికి ప్రభుత్వానికి మా యాక్షన్ ప్లాన్ ఇస్తామన్నారు.

Read also: Leopard Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో మహిళపై చిరుత దాడి.. భయాందోళనలో ప్రజలు

వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు తెలంగాణ సర్వీస్ కమిషన్ ను సందర్శించాలని అనుకుంటున్నాయన్నారు. నియామక ప్రక్రియ ఏదైనా గరిష్టంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేయాలని ప్లాన్ ఉంటుందని తెలిపారు. మార్చి చివరి వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పలితాలు విడుదల చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని తెలిపారు. ఏ పుస్తకం చదవాలి అనేది స్టూడెంట్స్ ఇష్టం ఆవిషయం పై TGPSC చెప్పదన్నారు. 5 లక్షల 51 వేల మంది ఈ ఎగ్జామ్ కి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రేపు, ఎల్లుండి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ అన్నారు.
Minister Seethakka: మాకు ఎలాంటి కక్ష లేదు.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై సీతక్క కామెంట్‌

Show comments