Tension in Dubbaka: దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. మంత్రితో పాటు స్టేజిపైకి కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. స్టేజీపైకి ఓడిపోయిన వారు రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో స్టేజీ పైనే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడని ఆందోళన చేపట్టారు. అక్కడ మూడు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేపట్టారు. మూడు పార్టీల కార్యకర్తలు నినాదాలు, తోపులాటతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితిలో ఉండిపోయారు. దీంతో అక్కడ నినాదాలు, తోపులాటల మధ్య కార్యకర్తలను పోలీసులు నిలువరించేందుకు తంటాలు పడ్డారు. చివరకు చెరకు శ్రీనివాస్ రెడ్డి స్టేజినుంచి కిందికి దిగి అసహనంతో వెళ్లిపోయారు. సామరస్యంగా ఉండాలని చెక్కులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. రసాభాసల మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేశారు.
Rajanna Siricilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్ బాటిల్ తో నిరసన..
Tension in Dubbaka: దుబ్బాకలో రచ్చ రచ్చ.. మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట
- దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చ..
- స్టేజినుంచి కిందికి దిగి అసహనంతో వెళ్లిపోయిన చెరకు శ్రీనివాస్ రెడ్డి..