Hyderabad Weather: హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు 7.1 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్ 7.4, రాజేంద్రనగర్ 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్‌పల్లి 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారం 10.2, శివరాంపల్లి 10.3, బాలానగర్ 1.1.4.5, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట్ 12, ఆసిఫ్‌నగర్ 12, నేరేడ్‌మెట్ 12.1, లంగర్ హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట, 2.82, మాదాపూర్, 2.81, మాదాపూర్, 12. చాంద్రాయణగుట్ట 13, కూకట్ పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్ గూడ 13.3, హయత్ నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
Read also: Telangana Assembly 2024: నేడు తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ..
రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తిరుమలగిరిలో 13.6 డిగ్రీల సెల్సియస్, చెర్లపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (నిర్మల్) తాండ్రలో 6.3 డిగ్రీలు, (ఆదిలాబాద్) పొచ్చర 6.4, జైనథ్ (ఆదిలాబాద్) 6.5, అర్లి (టి) (ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6, సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం (వికారాబాద్) 6.7సంగారెడ్డి ) 6.7, ఎలిమినేడు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్ (యు) (ఆసిఫాబాద్) 6.7, చందనవల్లి (రంగారెడ్డి) 6.7, కోహీర్ (సంగారెడ్డి) 6.7, మర్పల్లి (వికారాబాద్) 6.8, నాగారం (టి) (వికారాబాద్) 6.8, మన్నెగూడ (వికారాబాద్) 6.8 (వికారాబాద్) సంగారెడ్డి) 6.8, పోతారెడ్డిపేట (సిద్దిపేట)లో 6.9 డిగ్రీల సెల్సియస్, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9 డిగ్రీల సెల్సియస్, మేనూరు (కామారెడ్డి)లో 6.9 డిగ్రీల సెల్సియస్, రాఘవపేటలో (జగిత్యాల) 7.3 డిగ్రీల సెల్సియస్, కెరమెరిలో (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Group-2 Exams: తెలంగాణలో రెండోరోజు గ్రూప్-2 పరీక్ష..