NTV Telugu Site icon

Rythu Runa Mafi: రేపే రైతుల ఖాతాల్లోకి రుణ మాఫీ సొమ్ము.. కార్డు లేకున్నా వర్తింపు..

Cm Revanth Reddy Rytu Runa Mafi

Cm Revanth Reddy Rytu Runa Mafi

Rythu Runa Mafi: రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు (గురువారం) సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో రూ.లక్ష వరకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయని తెలిపారు. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని.. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వమి సీఎం అన్నారు. రుణమాఫీ చేస్తామన్న రైతువేదికలకు రైతులను తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ ఆనందాన్ని వారితో పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారి అందుబాటులో ఉంటారని అన్నారు. కలెక్టర్లకు ఏవైనా సందేహాలుంటే వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు సీఎం. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Read also: TG DSC Exams 2024: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్‌.. రేపటి నుండి పరీక్షలు..

ఇక అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని రైతుల పాస్ బుక్ ఆధారంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబ వివరాలను గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన విధించారని మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రుణమాఫీపై సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్‌కార్డు సదుపాయంపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం అన్నారు. దీని అమలుపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఏ రైతుకు నష్టం కలగకుండా.. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలన్నారు. రుణమాఫీ నిధుల వరకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామన్నారు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గతంలో వ్యక్తిగత, ఇతర రుణమాఫీకి వినియోగించలేదు బ్యాంకర్లు దీన్ని చేశారని గుర్తుచేశారు. మేము ఇప్పుడు అదే చర్య తీసుకున్నామని సీఎం అన్నారు.
Bhatti Vikramarka: నాలుగు నెలలు మాత్రమే.. నైనీ బొగ్గు ఉత్పత్తి పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..