NTV Telugu Site icon

Telangana TET Notification: తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..

Telangana Tet Notification

Telangana Tet Notification

Telangana TET Notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపటి నుండి (5 వ తేదీ) దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, టెట్ పరీక్షల కోసం రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరిలో పరీక్షలు జరగనున్నందున లక్షలాది మంది ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. TET పరీక్షలు ఆన్‌లైన్‌లో 2025 జనవరి 1 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 5 నుండి 20 మధ్య దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Read also: Bandi Sanjay: రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 2 లక్షల 86 వేల 386 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 2.35 లక్షల మంది రాశారు. ఈసారి డీఎస్సీ కూడా పూర్తి కావడంతో పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య కాస్త తగ్గుతుందని భావిస్తున్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉన్నందున, వారానికి కనీసం 10 రోజులు స్లాట్‌లు అందుబాటులో ఉండాలి. అందుకే సంక్రాంతి లోపు నిర్వహిస్తారా? ఆ తర్వాత? అనేది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టెట్ పేపర్-1కి డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత సాధించాల్సి ఉన్నందున వేలాది మంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు పరీక్షలు నిర్వహించగా…పదోసారి జనవరిలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలిపి ఆరుసార్లు పరీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ నిర్వహించడం విశేషం.
Harsha Sai : ఎట్టకేలకు హైదరాబద్ కు యూట్యూబర్ హర్ష సాయి..

Show comments