Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మూడు దశల్లో నిర్వహణకు స్టేట్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను రాష్ట్ర సర్కార్ కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Read Also: Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
అయితే, హైకోర్టులో కేసులపై క్షుణ్ణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలక్షన్ కమిషన్ నివేదికలు తీసుకుంది. మొదటగా ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఈసీ యోచిస్తుంది.
