NTV Telugu Site icon

Group-1 Prelims: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..

Group 1 Prelims

Group 1 Prelims

Group-1 Prelims: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి బలమైన కారణం కనిపించడం లేదని, మొయిన్స్‌ పరీక్షలు నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, ఎస్టీ రిజర్వేషన్ చెల్లదని 10 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన ధర్మాసనం ఇప్పటికే కొన్ని పిటిషన్లను కొట్టివేసింది. తాజాగా ఈరోజు (మంగళవారం) గత రెండు పిటిషన్లను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తీర్పుతో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలగిపోయింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.
World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?

Show comments