పాఠశాల దశలోనే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన అవసరం అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ తెలిపారు. రోడ్ సేఫ్టీ విషయంలోప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సింగిల్ లైన్, డబుల్ లైన్, హైవే రకరకాల రోడ్లు ఉంటాయని.. స్పీడ్ థ్రిల్‌గా ఉంటుందని… కానీ అది ప్రాణాల్ని తీస్తుంది…యువత దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న రూల్స్ పాటిస్తే… అద్భుత విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. క్లాస్ రూమ్‌లో అనేక విషయాలు తెలుస్తాయని… డాక్టర్, ఇంజనీర్ కావచ్చన్నారు.
ఇది కూడా చదవండి: Kolkata RG Kar Case : కోల్‌కతా కేసులో సంజయ్ కు జీవిత ఖైదు.. కోర్టు తీర్పు పై న్యాయవాదులు ఏమన్నారంటే ?
ట్రాఫిక్ రూల్స్‌పై తెలంగాణలో అవైర్ నెస్ పార్క్‌లు ఏర్పాటు చేయడం బాగుందని కితాబు ఇచ్చారు. ఆటలతో అనేక అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. పుట్‌బాల్‌తో సమాజంలో ఎలా బతకాలో ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకోవాలో తెలుస్తుందన్నారు. పొలిటీషియన్ ఒక బోరింగ్.. మీలో ఉన్న క్రియేటివిటీ బయటకు తీయండి.. అద్భుతమైన శాస్త్రవేత్తలు అవుతారని చెప్పారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.. విద్యార్థి దశ నేర్చుకునే దశ…ఈ దశలోనే సాంకేతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన చేసుకోవాలని విద్యార్థులకు గవర్నర్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Sankranthiki Vastunnam: అల వైకుంఠపురంలో రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం