IAS- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఆరుగురు IAS అధికారులను బదిలీ చేశారు. మరో 23 మంది IPS అధికారులను కూడా సర్కార్ బదిలీ చేసింది. భారీ స్థాయిలో IPS బదిలీలు చేశారు. ఇక, తెలంగాణ డీజీపీగా ఇప్పటికే బత్తుల శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
Read Also: Godavari Floods: విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం
అయితే, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు ఇటీవల వివాదాస్పదంగా మారింది. దీంతో అతడిపై తాజాగా బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్‌గా హరితను నియమించారు. ఇక, హైదరాబాద్ సీపీగా పని చేసిన CV ఆనంద్‌ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. అతడికి హోంశాఖ సెక్రెటరీగా బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్, ఇంటలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, RTC ఎండీగా నాగిరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్, ఫైర్ వింగ్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా చారుసిన్హాకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
