NTV Telugu Site icon

Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: గ్రేటర్ హైదరాబాద్ లో పవర్ కట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇకపై విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక వాహనాలను తీసుకువస్తుంది. ఈ వాహనాలను తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించారు. గతంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. అంబులెన్స్ తరహాలో CBD (సెంట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్ లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు.

Read also: CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..

ఈ వాహనాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉన్నాయన్నారు. ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నామన్నారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నమన్నారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారన్నారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయని తెలిపారు.
Tummala Nageswara Rao: అన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుంది..