Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో భేటీ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ హస్తిన పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌న్న ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్‌లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Hyderabad KPHB: ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు..

Exit mobile version