Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒక్కరోజు విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసి శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉభయ సభల్లో ఉదయం 10 గంటల నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై హరీష్ రావు మాట్లాడుతున్నారు.
-
అభయ హస్తం శున్య హస్తంలా మారింది - హరీష్ రావు
అభయ హస్తం శున్య హస్తంలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటులేదని తెలిపారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీలకు అనుగుణంగా కేటాయింపులు లేవన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. బీసీలు 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారని తెలిపారు. అభయ హస్తం శున్య హస్తంలా మారిందని మండిపడ్డారు.
-
హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్ - సీఎం రేవంత్
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. గృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాన్నారు.
-
సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది- సీఎం
సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు.
పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.
-
బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు. నడి రోడ్డుపై మిట్టమధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లను చంపేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. హరీష్ రావు మాట్లాడుతుంటె దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందన్నారు.
-
శాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయి - హరీష్ రావు
హైదరాబాద్ సిటీలో ఆటో ఎక్కిన అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారని హరీష్ రావు అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయని తెలిపారు. అర్దరాత్రి ఐస్ క్రీం తినాలనుకున్న మంత్రికి.. ఐస్ క్రీం దొరకలేదట అన్నారు. 10 గంటలకే హైదరాబాద్‌లో షాపులు మూసేస్తున్నారని.. రివ్యూలో సదరు మంత్రి సీఎంకు చెప్పారట అని మాట్లాడారు.
-
బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు- హరీష్ రావు
బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని హరీష్ రావు అన్నారు. బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలన్నారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
-
50 కోట్లకు రేవంత్ రెడ్డి పీసీసీ కొన్నాడని వెంకట్ రెడ్డి అన్నారు- హరీష్ రావు
కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అని హరీష్ రావు అన్నారు. 50 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కొన్నాడు అని వెంకట్ రెడ్డి అన్నాడు.. దానికి సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు హరీష్ రావు అన్నారు. కలక్టర్ కార్యాలయం లు.. అద్భుతంగా కేసీఆర్ కట్టారు అని అన్నది కోమటి రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
-
అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్ అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని తెలిపారు. హరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు. దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు. గతంలో హరీశ్ రావు ఒక డమ్మీ మంత్రి అంటూ మండిపడ్డారు.
-
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్‌ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామన్నారు.
-
కేసీఆర్ వస్తా అంటే నేను ఉదయమే వచ్చినా- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
12 మంది ఎంఎల్ఏ లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నది మీరని తెలిపారు. కేసీఆర్ మీడియా పాయింట్ కి వెళ్లి... చీల్చి చెందాడుత అన్నారు. సభకి కేసీఆర్ వస్తున్నాడేమో అని..9.30 కి సభకు వచ్చినా ఆయన రాలేదన్నారు. కేంద్రం అన్యాయం చేస్తే నోట్లో నుండి మాట రాలేదన్నారు. మమ్మల్ని చీల్చి చెండాడుతాడు అంట మొనగాడు అంటూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
-
హామీలు ఇచ్చి మోసం చేసేది మీరు - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
గ్యారెంటీ ల గురించి హరీష్ మాట్లాడుతున్నారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు దళితులను సీఎం చేస్తా అన్నాడు అన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసేది మీరు అన్నారు. డబుల్ బెడ్ రూం గురించి మాట ఇచ్చింది ఎవరు.. ఎన్ని ఇండ్లు ఇచ్చారు అని ప్రశ్నించారు. 14 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేదు బీఆర్ఎస్ అన్నారు. సబ్ స్టేషన్ వెళ్లి చూస్తే... బయట పడింది అని మండిపడ్డారు.
-
కాలేశ్వరం ప్రాజెక్టుపై అన్నిటికీ సమాధానాలు చెప్తా- హరీష్ రావు
కాలేశ్వరం ప్రాజెక్టుపై నేను ఒకే మాటపై ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా రూ.94 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పాను. బతుకమ్మ చీరలపై సీఎం వ్యాఖ్యలు సరికాదు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నిటికీ సమాధానాలు చెప్తాను.
-
సీఎం రేవంత్ ప్రశ్నకు హరీష్ రావు సమాధానం
గత ప్రభుత్వం భూములు అమ్మింది అన్ని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సమాధానం మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చారు. సీఎం గల ప్రభుత్వం రముల అమ్మింది అంటున్నారు. సీఎం గత ప్రభుత్వం భూముల అమ్మింది అంటున్నారు.. మరి ఈ బడ్జెట్లో 24 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మి తెస్తాం అనడం ఏంటి?. మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క మెడికల్ కాలేజీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ బీఆర్ఎస్ ఇచ్చింది.
-
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పాలమూరు కి ఏం చేశారు..- హరీష్ రావు
మీ భట్టి భూములు అమ్ముతా అని పెట్టారు.. దానికి సీఎం సమాధానం చెప్పాలి అని హరీష్ రావు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పాలమూరు కి ఏం చేశారు సీఎం సమాధానం చెప్పాలి అని హరీష్ రావు ప్రశ్నించారు.
-
బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, గొర్రెలు పథకంపై విచారణకు సిద్ధమా- రేవంత్
విద్యుత్ ఒప్పందంలో అన్ని లెక్కలు బయట పెడతాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో పెట్టీ అడుగుతం.. కడుగుతం అన్నారు. బతుకమ్మ చీరలు.. కేసీఆర్ కిట్..గొర్రెలు పథకం మీద విచారణకు సిద్ధమా? అని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. సమాధానం చెప్పండి అని అన్నారు.
-
భూములు,ఆస్తులు అమ్ముకుంటారు..కానీ నీళ్లు ఇవ్వరు - సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటారు. ఆస్తులు అమ్ముకుంటారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వరు. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు.
-
మా తట్ట పని..పార పనే మాకు మిగిలింది-సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు వాళ్ళం ఏం తప్పు చేశాం..ఏం అన్యాయం చేశాం అన్నారు. కరీంనగర్ నుండి పాలమూరుకి వస్తె ... గెలిపించినం మేము అన్నారు. భుజాల మీద మోసి పార్లమెంట్ కి పంపితే... సీఎం అయ్యాక పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా? అని ప్రశ్నించారు. మా తట్ట పని..పార పనే మాకు మిగిలిందన్నారు.
-
గొర్రెల స్కామ్ లో 700 కోట్ల అవినీతి- సీఎం రేవంత్ రెడ్డి
గొర్రెల స్కామ్ లో 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఇప్పటివరకు ఏసీబీ తేల్చింది. ఇప్పుడు ఈ స్కాం పైన ఈడి కూడా దర్యాప్తు చేయడానికి రెడీగా వచ్చి కూర్చుందని తెలిపారు.
-
హరీష్ రావు Vs రేవంత్ రెడ్డి
కాళేశ్వరం వెళ్లి... ఇంకా ఏమైనా కూలిందా.. మిగిలిందా అన్నట్టు వెళ్లి చూసొచ్చారు. ఎన్ని వేల కోట్ల భూములు అమ్ముకున్నారు. దాని లెక్క కూడా చెప్పాలి కదా హరీష్ రావు అన్నారు. వాటి సంగతి చెప్పడం లేదు ఎందుకు? అని హరీష్ రావును సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
-
కేసీఆర్ కిట్ లో దోపిడీ మీద విచారణకు సిద్ధం - సీఎం రేవంత్ రెడ్డి
ఇంకా ప్రజలను మభ్యపెడితే ఎలా? బుద్ధి చెప్పినా వారి బుద్ధి మారలేదన్నారు. ఓఆర్ఆర్ మేము ఇస్తే.. పల్లి బఠాణీ లకు 7 వేల కోట్లు కు అమ్ముకున్నారని మండిపడ్డారు. గొర్రెలు ఎవరికి ఇచ్చారో కానీ 700 కోట్లు మింగారు అని ఏసీబీ చెప్పింది.. ఈడీ వచ్చి కుసుండన్నారు. బతుకమ్మ చీరలు సూరత్ లో కిలోల చొప్పున కొని తెచ్చారు. కేసీఆర్ కిట్ లో దోపిడీ మీద విచారణ చేద్దాం అంటే సిద్ధం అన్నారు.
-
కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్ ను పక్కకు పెట్టింది - హరీష్ రావు
ఆరోగ్య శ్రీ పథకం వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టారు.ఫీజు రీయింబర్స్ మెంట్, 108 పథకాలను వైఎస్సా్ ప్రారంభించారు. వైఎస్‌ఆర్ పెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడారు. మంచి పథకాలు అయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ , 108 ను పేర్లు మార్చకుండా కేసీఆర్ కొనసాగించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్ ను పక్కకు పెట్టిందని హరీష్ రావు తెలిపారు.
-
రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు - హరీష్ రావు
రుణమాఫీ కోసం 31వేల కోట్లు ఖర్చు అని సీఎం రేవంత్ అన్నారు. బడ్జెట్ లో 26వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది. 5వేల కోట్ల రూపాయలను కోత విధాంచారు ఎలా బడ్జెట్ తగ్గింది? రుణమాఫీ కోత విధించారు.. రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని హరీష్ రావు అన్నారు.
-
24వేల కోట్ల ఆదాయం బడ్జెట్ లో చూపించారు - హరీష్ రావు
భూములు అమ్మి 10వేల కోట్లు, మరో 14 వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని బడ్జెట్ పెట్టారు. ఆదాయ మార్గాలను చెప్పకుండ 24వేల కోట్ల రూపాయలను ఆదాయం అని బడ్జెట్ లో చూపించారు. వారసత్వ భూములు ఎలా అమ్ముతారు? అని ఆనాడు నేటి సీఓం రేవంత్ అన్నారు.
-
రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు? బెల్ట్ షాపులను పెంచుతారా? - హరీష్ రావు
ఎక్సైజ్ ఆదాయం 7వేల కోట్లు ఎలా పెరుగుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మద్యం బానిసలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మద్యంపై ఆదాయం పెరుగుతుంది అంటే బీర్ల ధరలు పెంచుతారా? బెల్ట్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతారా? అని ప్రశ్నించారు హరీష్ రావు.
-
సభా నాయకుడు సభలో లేడు - హరీష్ రావు
సభా నాయకుడు (సీఎం రేవంత్ రెడ్డి) సభలో లేడని హరీష్ రావు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో.. బెల్ట్ షాపులు ఎత్తేస్త అన్నారు.. ఏమైంది అని అడుగుతున్న అని ప్రశ్నించారు. ఆదాయం 7 వేల కోట్లు పెంచుతాం అన్నారు.. ఎలా పెంచుతారు అని అడుగుతున్న అన్నారు.
-
వైన్ షాపులు టెండర్.. ముందే ఎందుకు పెట్టారు - భట్టి
వైన్ షాపులు టెండర్.. ముందే ఎందుకు పెట్టారు అని భట్టి విక్రమార్క అన్నారు. టానిక్ లాంటి దుకాణాలు పెట్టీ సర్కార్ కి డబ్బులు రాకుండా..కొందరి కుటుంబాలకు వచ్చేలా చేశారని మండిపడ్డారు. మేము అలా చేయం. వ్యక్తుల దగ్గరికి పోనివ్వం.. సర్కారు సొమ్ము.. ప్రజలకే అందేలా చూస్తామన్నారు.
-
హరీష్ vs భట్టి
ప్రతిపక్ష నేత బడ్జెట్ కి వచ్చారు. ఇవాళ సభకు రాలేదు. వీళ్ళు వచ్చి గుడ్డ కాల్చి మీద వేస్తే ఎట్లా అంటూ హరీష్ రావు అన్నారు. భట్టి కూడా ఒప్పుకున్నారని హరీష్ రావు తెలిపారు. దీనికి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారు.. నేను ఒప్పుకున్నానా..?
-
నగరాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన బడ్జెట్ - భట్టి
పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారు. మేము నెలనెలా వారికి జీతాలు ఇచ్చే పని మొదలుపెట్టాం. రైతుల్ని హైదరాబాదు నగరాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన బడ్జెట్ని ప్రవేశపెట్టాం. మా బడ్జెట్ చూసి హరీష్ రావు కి కంటగింపుగా ఉంది. జూపల్లి గల్లి గల్లి కి బెల్ట్ షాపులు పెడతా అన్నారా..? మరి హరీష్ రావు.. అలా ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారు.
-
హరీష్ రావు మా పై నిందలు వేస్తున్నారు -జూపల్లి కృష్ణారావు
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2014 లో 10 వేల కోట్ల ఆదాయం తెచ్చిందని జూపల్లి కృష్ణారావు అన్నారు. 2023..24 లో 34 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పుడు హరీష్.. మా పై నిందలు వేస్తున్నారు
-
కరెంట్ పై హరీష్ రావు..
రోడ్డు మీదకు వెళ్ళి.. భట్టి..నేను నిలబడి జనం నీ అడుగుదాం అన్నారు. కరెంట్ బీఆర్ఎస్ బాగా ఇచ్చిందా..కాంగ్రెస్ బాగా ఇస్తుందా అంటే జనమే చెప్తారు. కేకే ఇంటికి సీఎం వెళ్ళారు.. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లగానే కరెంట్ పోయింది.
-
పాంచ్ న్యాయ్ అన్నారు - హరీష్ రావు
రాహుల్ గాంధీ వారసులం అంటున్నారు. పాంచ్ న్యాయ్ అన్నారు...పార్టీ మారిన ఎంఎల్ఏ తో రాజీనామా చేయించండి అన్నారు. ఎదుటి వారికి తిట్టిపోస్తే... తన బలహీనత బయట పెట్టుకున్నట్టు కాంగ్రెస్ చేస్తుంది అదే అన్నారు. ఎన్ని రోజులు మమ్మల్ని తిట్టుకుంటూ బతుకుతారు అన్నారు.
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై హరీష్ రావు మాట్లాడారు. మమ్మల్ని కూడా చూపించండి.. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఇదే చెప్తున్నారు అన్నాఉ. ఆయన వారసులు అని చెప్పుకునే మీరు.. మమల్ని కూడా చూపించండి అంటూ మాట్లాడారు.