NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్‌, రాయదుర్గం, మియాపూర్‌, ఎల్బీనగర్‌ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్‌ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్‌ నిలిపివేశారు అధికారులు. సాంకేతిక కారణాలవల్ల ఇబ్బంది కలిగినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి మెట్రో రైళ్లకు అంతరాయం ఏమీ కలగలేదు.. అయితే ఉదయం 10 గంటల నుంచి సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం ఏర్పడిందని త్వరలోనే యదావిధిగా మెట్రో రైళ్లు ప్రయాణం జరుగుతుందని మెట్రో యాజమాన్యం విరించారు. అయితే లోపానికి గల కారణం ఏమి అనేది ఇంకా తెలియరాలేదు. పలు మెట్రో రైళ్లు పట్టాలపైనే నిలిపివేయడంతో ఉద్యోగస్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోట్రో స్టేషన్లకు ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో మెట్రో స్టేషన్ రద్దీగా మారింది. కొందరిని లోపలికి అనుమతి లేదని, మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. సుమారు అరగంట గడుస్తున్నా మెట్రో రైళ్లు కదలకపోవడం తీవ్ర ఇబ్బందిని గురిచేస్తుందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం లోపాన్ని సరిచేస్తున్నామని.. ఇంకాస్త సమయం అవుతుందని వెల్లడించారు.
KTR Tweet: ధాన్యం కొంటే రూ.500 బోనస్.. అసలు కొనకుంటే అంతా బోగస్..

Show comments