Metro Deluxe Buses: కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించరాదని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. ‘స్టాఫ్ నాట్ అలోడ్’ అని స్టిక్కర్లు అంటించారు. మహిళలు, జర్నలిస్టులు, స్కూల్ పిల్లలు, ఎస్కార్ట్ పోలీసులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఎయిడ్స్, డయాలసిస్ రోగులు, పోలీసు అమరవీరుల భార్యలు, ఎస్కార్ట్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తుంది. అంతే కాకుండా చాలా మందికి ఆర్టీసీ యాజమాన్యం 50 శాతం రాయితీలు కల్పిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం’ అని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ సర్వీసుల్లో ఆర్టీసీ సిబ్బందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఆర్టీసీ పున:పరిశీలించి ఆర్టీసీ సిబ్బందిని కూడా ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
Read also: Love Tragedy: ప్రేమ జంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలు కిడ్నాప్..
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో బస్సుల రద్దీ పెరిగింది. టిక్కెట్లు కొని ప్రయాణించే వారికి సీటు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త బస్సులను నడుపుతోంది. అందులో 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు వీటికి అదనంగా మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా మరో 125 డీలక్స్ బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు జూలై నుంచి ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ డీలక్స్ బస్సులు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో తిరుగుతున్నాయి. కాగా, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొత్త డీలక్స్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Floods In Nepal: భారీ వరదలు.. 112 మంది మృతి.. కొట్టుకుపోయిన వందలాది మంది!