NTV Telugu Site icon

Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..

Revanthreddy Rakhi Festivell

Revanthreddy Rakhi Festivell

Raksha Bandhan-2024: రక్షా బంధన్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. సీఎం రేవంత్, ఆయన మనవడికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కి రాఖీలు కట్టారు. ‘సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాడు చంద్రుడిలా చల్లగా ఉంటుంది. ఈ పండగ సందర్భంగా రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పండు, తేనె లాంటి సుఖ సంతోషాలతో ఉండాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా..రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ రాఖీ కట్టారు.

Read also: Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్‌ డిమాండ్‌..

సీఎంకు రాఖీ కట్టిన సీతక్క మాట్లాడుతూ.. మహిళల అందరిలో మన అక్క.. చెల్లెళ్ళ నీ చూసుకోవాలన్నారు. అందరికీ రక్షా బందన్ శుభాకాంక్షలు తెలిపారు. పురుష సమాజంకి విజ్ఞప్తి చేస్తున్నా.. మన ఇంట్లో ఆడ బిడ్డ లాగ..బయట మహిళను చూడండి అన్నారు. అప్పుడే సమాజం లో శాంతి అన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీతక్క రాఖి కట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఈ రక్షణ రక్షాబంధన సందర్భంగా కూడా నేను ఓ సారి గుర్తు చేస్తన్న అన్నారు. మహిళల రక్షణ విషయంలో మేము చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. సింఘ్వీ తో తెలంగాణకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్న అన్నారు. అన్ని పార్టీలుగా సహకరించాలన్నారు.
Vinesh Phogat: అస్వస్థతకు గురైన వినేశ్‌ ఫొగాట్!