NTV Telugu Site icon

Telangana Assembly 2024: సీతక్క వీడియో మార్ఫింగ్.. ట్రోలింగ్ అంశం పై సభలో చర్చ..

Assembly 2024

Assembly 2024

Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9వ రోజు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం సీతక్క వీడియో మార్ఫింగ్ అంశంపై సభలో చర్చ కొనసాగింది. సోషల్ మీడియా పై మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో మాట్లాడుతూ.. సభలో ఏదో ఓ వీడియో తీసుకుని ఇష్టారాజ్యంగా పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా అసభ్య కరంగా పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి? అని ప్రశ్నించారు.
Read also: Sri Lanka Team: శ్రీలంకపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ వీరే..

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్…అసెంబ్లీ లో ఫోటో లు తీయడం నేరమన్నారు. సీరియస్ యాక్షన్ ఉంటుందని తెలిపారు. ఫోటోలు తీశారు అనే ఆరోపణ మీదనే ఓ ఎంపీ నీ సస్పెండ్ చేశారు. ఇక శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సీతక్క మీద తప్పుడు ట్రోలింగ్ చేస్తే చర్యలు తీసుకోవద్దా ? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు చర్యలు తీసుకోవద్దు అన్నట్టు వ్యవహారం చేస్తున్నారని అన్నారు. శాసన సభ ప్రొసీడింగ్స్ లైవ్ నీ మార్ఫింగ్ చేయడం బాధాకరం అన్నారు. విచారణ జరిపిస్తామన్నారు. సభ మర్యాదలు పాటించాలి అందరూ అన్నారు. సీరియస్ గా తీసుకుంటామన్నారు. సభ సెక్రటేరియట్ నీ అప్రదిష్ట పాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ మార్ఫింగ్ వీడియో పై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, సీరియస్ గా పరిగణిస్తామని అన్నారు.

Read also: Olympics gold medal: ఒలింపిక్స్ బంగారు పతకంలో స్వర్ణం ఎంత ఉంటుందో తెలుసా?

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్‌ కోర్టుల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నామని, స్వాగతిస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే న్యాయ వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను పరిరక్షించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలి. అత్యాచారాలు, సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలని కోరారు. ఇతరులెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడబోరని కేటీఆర్ అన్నారు. బాధ్యులు ఎవరైనా ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. అందరి మీద ఇలాంటి దాడి జరుగుతుందన్నారు. నెహ్రూ నుండి.. ఇప్పటి వరకూ మన మీద వరకు క్యారెక్టర్ దెబ్బ తినేలా ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. అందరి మీద చర్యలు తీసుకోవాలన్నారు. సభలో కూడా గౌరవ ప్రదమైన మాటలు మాట్లాడేలా రూలింగ్ ఇవ్వాలన్నారు.
Dog Attack: నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కల దాడి.. చెల్లాచెదురుగా శరీర భాగాలు..

Show comments